‘హోల్‌సేల్‌గా అవినీతి చేశాడు కాబట్టే చంద్రబాబును..’ | AP Minister Botsa Satyanarayana Satires CBN | Sakshi
Sakshi News home page

ఏపీకి మూడు రాజధానులే.. యెల్లో బాస్‌పై మంత్రి బొత్స సెటైర్‌

Feb 16 2023 2:43 PM | Updated on Feb 16 2023 6:48 PM

AP Minister Botsa Satyanarayana Satires CBN - Sakshi

హోల్‌సేల్‌గా అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఆయన్ని హోల్‌సేల్‌గా.. 

సాక్షి, విజయవాడ: మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని, అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని మరోసారి కుండబద్ధలు కొట్టారు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

హోల్‌సేల్‌ ఎవరో.. రిటైల్‌ ఎవరో ఏపీ ప్రజలకు స్పష్టంగా తెలుసని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. చంద్రబాబు హోల్‌సేల్‌గా అవినీతికి చేశాడు కాబట్టే.. ప్రజలు హోల్‌సేల్‌గా ఇంటికి పంపించారని మంత్రి బొత్స సెటైర్‌ వేశారు. అంతేకాదు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని బొత్స వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement