వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు: ఏపీ సీఈవో | AP CEO Mukesh Kumar Meena Said All Arrangements For Polling Have Been Completed, Details Inside | Sakshi
Sakshi News home page

వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు: ఏపీ సీఈవో

Published Sun, May 12 2024 3:52 PM

Ap Ceo Mukesh Kumar Meena Said All Arrangements For Polling Have Been Completed

సాక్షి, అమరావతి: పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. జీరో వయొలెన్స్, జీరో రీ-పోలింగ్ లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ చేపడతున్నామని పేర్కొన్నారు. 64 శాతం మేర పోలింగ్ స్టేషన్లల్లో వెబ్ కాస్ట్ పెట్టాం. పోలింగ్ స్టేషన్ల లోపల, బయటా వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశాం. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు.

పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదు. పోల్ డేటా మానిటరింగ్ సిస్టం పీడీఎంఎస్‌ యాప్ ద్వారా పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తాం. కొన్ని చోట్ల కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారనే సమాచారం వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీస్ అబ్జర్వర్లు, జనరల్ అబ్జర్వర్లను ఈసీ నియమించింది. 20 శాతం మేర ఈవీఎంల బఫర్ స్టాక్ వచ్చింది’’ అని సీఈవో వెల్లడించారు.

సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించే మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం. వృద్ధులకు, దివ్యాంగులకు పోలింగ్ స్టేషన్లల్లో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement