వైఎస్ జగన్‌ను కలిసిన ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్‌ వింగ్స్‌ ప్రతినిధులు | All University Divyang Wings Representatives Meet YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ను కలిసిన ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్‌ వింగ్స్‌ ప్రతినిధులు

May 19 2026 5:39 PM | Updated on May 19 2026 5:45 PM

All University Divyang Wings Representatives Meet YS Jagan

సాక్షి,తాడేపల్లి: ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్‌ వింగ్స్‌ ప్రతినిధులు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్,లెక్చరర్ పోస్టుల భర్తీలో వికలాంగులకు మోసం చేస్తున్నారంటూ  ఆవేదన వ్యక్తం చేశారు.

తమలాంటి దివ్యాంగులకు చంద్రబాబు ప్రభుత్వం అవకాశాలు ఇవ్వటం లేదని వాపోయారు. తమకు రిజర్వేషన్ ఇవ్వకపోవటంతో ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యాయని తెలిపారు. దివ్యాంగ హక్కుల చట్టాన్ని కూడా అమలు చేయటం లేదంటూ ఫిర్యాదు చేశారు.

ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్‌ వింగ్స్‌ ప్రతినిధుల ఆవేదనపై వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. దివ్యాంగులకు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ని కలిసిన వారిలో ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్‌ వింగ్స్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎం. కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ఎం. శ్రీనివాసరావు తదితరులున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement