
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 50,027 కరోనా పరీక్షలు నిర్వహించగా, 227 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు ఏపీలో కరోనా బారిన పడివారి సంఖ్య 884916కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా 289 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 875243 మంది డిశ్చార్జ్ అయ్యారు.(చదవండి: ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు)
గత 24 గంటల్లో కోవిడ్ బారినపడి విశాఖపట్నంలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 7129కి చేరింది. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటివరకు 1,23,24,674 శాంపిల్స్‌ను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2544 యాక్టివ్ కేసులు ఉన్నాయి.(చదవండి: అనసూయ ట్వీట్.. మెగా ఫ్యామిలీలో కలకలం!)