ఏపీలో 14 గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు | 14 green energy projects in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో 14 గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు

May 20 2026 5:23 AM | Updated on May 20 2026 5:23 AM

14 green energy projects in AP

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 14 హరిత ఇంధనం (గ్రీన్‌ ఎనర్జీ) ప్రాజెక్టులకు ప్రభు త్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.   

అనుమతులు పొందిన ప్రాజెక్టులు  
» శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6600 మెగావాట్ల ఏసీ/ 9000 డీసీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టు.  
» అదానీ హైడ్రో ఎనర్జీ ఎలెవన్‌ లిమిటెడ్‌కు వైఎస్సార్‌ కడపజిల్లా గండికోటలో 2250 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు–2. 
»  తిరుపతి జిల్లాలో యమ్నాకో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 89 కేటీపీఏ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు 
» అనంతపురం జిల్లా డి.హిరేహాల్‌ మండలంలోని కడలూరు, హుళికల్‌ గ్రామాల్లో క్లీన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ సంస్థకు 140.80 ఏసీ/ 211.20 డీసీ ప్రాజెక్టులు. 
» నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లి గ్రామంలో క్లీన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 35 ఏసీ/ 52.50 డీసీ ప్రాజెక్టు. 
» పల్నాడు జిల్లా విప్పర్ల గ్రామంలో 12 టీపీడీ సామర్థ్యంతో డెల్టా బయోగ్యాస్‌ పల్నాడు టు ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌. 
» ఏలూరు జిల్లా ముప్పవరం గ్రామంలో 20 టీపీడీ సామర్థ్యంతో హెచ్‌పీసీఎల్‌ రెన్యువబుల్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌.  
» తిరుపతి జిల్లా నాయడుపేట మండలం మెనకూరు గ్రామంలో ఎనర్జియా బయోఫ్యూయెల్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థకు 12 టీపీడీ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌.  
» తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో  విభాబయోఫ్యూయెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 15 టీపీడీ బయోగ్యాస్‌ ప్లాంట్‌.  
» నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని సున్నంవారిచింతల గ్రామంలో శ్రీ బాలాజీ బయో ఎనర్జీస్‌ అండ్‌ ఆర్గానిక్స్‌కు 12 టీపీడీ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌.  
» ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం కడింపొరవరంలో ఐవోసీజీపీఎస్‌ రెన్యువబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 15 టీపీడీ  కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌. 
»  విజయనగరం జిల్లా వంగర మండలం తలగాం గ్రామంలో అమృత శ్రీ బయో–సీఎన్‌సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 12 టీడీపీ బయో–సీఎన్‌సీ ప్లాంట్‌ . 
»  క్రోమా–ఆటోర్‌ పవర్‌ ప్రొడక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేపట్టనున్న 200 టీపీడీ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్రాజెక్టు ఎడవల్లి గ్రామం నుంచి రెంటచింతల మండలం జెట్టిపాలెం గ్రామానికి మార్పు. 
» శ్రీ సత్యసాయి జిల్లా ఎన్‌పీకుంట మండలంలోని పి.కొత్తపల్లి గ్రామంలో 100 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కోసం 325 ఎకరాల భూమి లీజ్‌ ఒప్పందం పునరుద్ధరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement