కణేకల్లు: మండలంలోని కణేకల్లు, కె.కొత్తపల్లి, 43 ఉడేగోళం, బ్రహ్మసముద్రం తదితర గ్రామాల్లో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు కణేకల్లులో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నేలకొరిగిన చెట్లు : గుమ్మఘట్ట: రాయదుర్గం మండలం రాతిబావివంక గ్రామ రైతులు వెంకటరెడ్డి, సుశీలమ్మకు చెందిన బొప్పాయి, అల్లనేరేడు చెట్లు సోమవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు నేలకొరిగాయి. దాదాపు రూ. 20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అలాగే నారాయణరెడ్డి పొలంలో టేకు చెట్లు నేలకూలడంతో లక్ష రూపాయల నష్టం వాటిల్లింది. మండలంలోని చదం, మల్లాపురం, రాతిబావివంక గ్రామాల్లో 16 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.


