జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలర్పించిన అనంతరం వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నాయకులు నగరంలోని జగ్జీవన్‌రామ్ విగ్రహం ముందు అర్ధ నగ్నంగా నిరసన తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీలకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్‌లో దళితులపై దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన దళితులపై చిన్న చూపు తప్పడం లేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా దళితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం దళితులపై వివక్ష కొనసాగిస్తే ఐక్య పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, నగర అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, పసులూరి ఓబిలేసు, కమల్ భూషణ్, అమర్‌నాథ్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్, ఎంఎస్‌ఎస్ సాధిక్‌వలి, రిజ్వాన్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాసులు, చంద్రలేఖ, రాధకృష్ణ, మహిళా విభాగం నాయకులు శ్రీదేవి, కృష్ణవేణి, దేశాయి భారతి, శోభరాణి, రాధయాదవ్, భారతి, మాజీ డైరెక్టర్ శ్రీనివాసులు, వడ్డే రామచంద్ర, సాకే కుళ్లాయిస్వామి, సాకే అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


