వజ్రకరూరు: మండల కేంద్రంలో జనార్దన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమద్ వాహన కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు హోమాలు చేశారు. రాత్రి హనుమద్ వాహన కార్యక్రమం నిర్వహించారు. ఈఓ అంగదాల క్రిష్ణయ్య, ప్రధాన అర్చకుడు నరసింహమూర్తి, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కాగా సోమవారం కల్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.
జంబుకేశ్వరస్వామీ నమోనమః
● ముగిసిన బ్రహ్మోత్సవాలు
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ముగిశాయి. చివరి రోజు ఆదివారం సాయంత్రం స్వామి వారి సప్త ప్రాకారోత్సవం, శయనోత్సవ వేడుకలను అర్చకుడు రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాద వినియోగం చేశారు. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేకులకుంట సత్యనారాయణ, దేవదాయశాఖ ఈఓ నరసింహారెడ్డి, బ్రాహ్మణ సంఘం పెద్దలు పాల్గొన్నారు.


