మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Mar 9 2026 7:24 AM | Updated on Mar 9 2026 7:24 AM

అనంతపురం: మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాంచాలని కలెక్టర్‌ ఆనంద్‌ సూచించారు. జేఎన్‌టీయూ (ఏ) ఆడిటోరియంలో ఆదివారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి కలెక్టర్‌ ఆనంద్‌ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో డీఆర్‌డీఏ, మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖ, తదితర శాఖలు మహిళలకు జీవనోపాధులు పెంపొందించుకునేందుకు అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారని, వాటిపై విస్తృత అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో 4,250 మంది దాకా చిన్న వయసులో పెళ్లి చేసుకుని టీనేజ్‌ ప్రెగ్నెన్సీ కలిగిన వారు ఉండడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ వెంకటశివుడు యాదవ్‌, జేఎన్‌టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌.సుదర్శనరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కమలమ్మ, వీర శైవ లింగాయత్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, అనంతపురం మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ బల్లా పల్లవి, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, డీఆర్‌డీఏ పీడీ శైలజ, మెప్మా పీడీ విశ్వజ్యోతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఇ.బి.దేవి, బీసీ వెల్ఫేర్‌ డీడీ ఖుష్బూ కొఠారి, డీసీఓ అరుణకుమారి, జిల్లా హార్టికల్చర్‌ అధికారి ఉమాదేవి, డీఎస్‌డీఓ మంజుల, బీసీ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ అధికారి సుభాషిణితో పాటు స్వయం సహాయక సంఘం సభ్యులు, మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement