భారత జట్టులోకి ‘ఫరాన్ సభాఖానం’
● గోల్‌షాట్ బాల్ పోటీల్లో ప్రతిభ
కదిరి అర్బన్: గోల్‌షాట్ బాల్ భారత క్రీడా జట్టులో కదిరి పట్టణానికి చెందిన ఫరాన్ సభాఖానం చోటు దక్కించుకున్నట్లు గోల్‌షాట్ బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎన్ రాజేంద్రప్రసాద్, ముఖ్యకార్యదర్శి మనోహర్‌రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యదర్శి ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోందని పేర్కొన్నారు. గత పదేళ్లుగా ఫరాన్ సభాఖానం క్రీడల్లో రాణిస్తోందని చెప్పారు. జిల్లా, రాష్ట్ర , జాతీయస్థాయిలో పాల్గొని సత్తాచాటి భారత జట్టులో చోటు సంపాదించినట్లు తెలియజేశారు. నేపాల్ దేశంలోని ఖాట్మండ్‌లో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకూ జరిగే గోల్‌షాట్ బాల్ సౌత్ ఏషియన్ చాంపియన్‌షిప్ క్రీడల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అక్కడ కూడా మంచి ప్రతిభ కనబరని పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
జాతీయస్థాయి
స్కూల్ గేమ్స్‌కు ఎంపిక
ఉరవకొండ: స్థానిక ప్రభుత్వ జడ్పీ సెంట్రల్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌కు ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వరీ, పీడీలు మారుతీప్రసాద్, రాఘవేంద్రలు తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన అండర్–14 ఫుట్‌బాల్ విభాగంలో పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని అమృత అద్భుత ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ందని పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి జార్గండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగే జాతీయస్థాయి అండర్–14 ఫుట్‌బాల్ పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుందన్నారు. అలాగే అండర్–14 సెపక్‌తక్రా జాతీయ పోటీలకు 6వ తరగతి చదివే అంజలి ఎంపికై నట్లు తెలిపారు. ఈనెలాఖరు నుంచి రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్‌లో జరిగే జాతీయస్థాయి సెపక్‌తక్రా పోటీల్లో అంజలి పాల్గొంటుందన్నారు.
రాష్ట్ర ప్రాబబుల్స్‌కు
జిల్లా క్రీడాకారులు
అనంతపురం కార్పొరేషన్: అండర్ –15 రాష్ట్ర మహిళా క్రికెట్ జట్టు ప్రాబబుల్స్‌లో అనంతపురానికి చెందిన ఆరుగురు క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు నెల్లూరులో రాష్ట్ర ప్రాబబుల్స్ జరగనున్నాయి. జిల్లా నుంచి డీ చంద్రిక, బీ తేజశ్విని, ఎం దారామోహన్, ఏ మన్విత, ఎస్ అక్షర, హుస్నారా ఎంపికయ్యారు. క్రీడాకారులు ఎంపికపై జిల్లా క్రికెట్ సంఘం హర్షం వ్యక్తం చేసింది.
ఆదాయ వనరులపై
దృష్టి సారించండి
● డీఆర్‌ఎం సీఎస్ గుప్తా
గుంతకల్లు: రైల్వే డివిజన్ ఆదాయ వనరులపై దృష్టి సారించాలని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా సిబ్బందికి సూచించారు. శుక్రవారం స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో కమర్షియల్, ఆపరేటింగ్ బ్రాంచ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ సిమెంట్ ఫ్యాక్టరీలకు అనుసంధనంంగా ఏర్పాటు చేసే నూతన రైల్వేలైన్‌లకు భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం బనగానపల్లి రైల్వేస్టేషన్ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి మధ్య రైల్వేలైన్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిమెంట్ రవాణా మెరుగుకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి సిద్ధం ఉన్నామని తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
రూ.7.44 లక్షల విలువైన ఎరువుల సీజ్
యాడికి: ఎరువులు, యూరియా ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం వ్యవసాయ సహాయ సంచాలకులు అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. శుక్రవారం ఏఓ మహబూబ్‌బాషాతో కలిసి మండల కేంద్రంలోని వెంకట్ ఫర్టిలైజర్స్, సుఫలా ఫర్టిలైజర్స్, రాయలచెరువులోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, న్యూలక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాలను తనిఖీ చేశారు. వెంకట్ ఫర్టిలైజర్స్‌లో అనుమతి అయిపోయినా అమ్మకాలు, నిల్వలు ఉండటాన్ని గుర్తించారు. అలాగే రైతులకు ఇచ్చే బిల్లుల్లో వివరాలు రాయకపోవడాన్ని గమనించారు. దీంతో ఫ్యాక్ట్ కంపెనీకి చెందిన రూ 7,44,405 విలువైన 38 టన్నుల ఎరువులను సీజ్ చేసి కోర్టుకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
భారత జట్టులోకి ‘ఫరాన్ సభాఖానం’
భారత జట్టులోకి ‘ఫరాన్ సభాఖానం’


