‘దుర్గం’ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గౌతమి
కళ్యాణదుర్గం: నాటకీయ పరిణామాల మధ్య కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీజేపీ నుంచి టీడీపీలోకి చేరిన తలారి గౌతమి ఎన్నికయ్యారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ వసంతబాబు ఆధ్వర్యంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. 22 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఎన్నికకు గైర్హాజరయ్యారు. చైర్మన్ పదవి కోసం వైఎస్సార్‌సీపీ నుంచి 14వ వార్డు కౌన్సిలర్ లక్ష్మన్న, టీడీపీకి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ గౌతమి పోటీపడ్డారు. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్ష్మన్నకు 11 మంది, టీడీపీ అభ్యర్థి గౌతమికి 11 మంది కౌన్సిలర్లు చేతులెత్తి మద్దతు తెలిపారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తమ పార్టీ అభ్యర్థి గౌతమికి మద్దతుగా చేతులెత్తడంతో వారి సంఖ్యాబలం 13కు చేరింది. దీంతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గౌతమి ఎన్నికై నట్లు ప్రిసైడింగ్ అధికారి వెల్లడించారు.
144 సెక్షన్ ఉల్లంఘన
గురువారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎన్నికల కమిషన్ విధించిన 144 సెక్షన్‌ను టీడీపీ నేత లు ఉల్లంఘించారు. ఎన్నిక జరుగుతున్న నమయంలో నేరుగా చంద్రబాబు జిందాబాద్, అమిలినేని జిందాబాద్ అంటూ ఎమ్మెల్యే అల్లుళ్లు ధర్మతేజ, అవినాష్ తమ అనుచరులతో ఎన్నిక జరిగే మున్సిపల్ కార్యాలయం వద్దకు చొచ్చుకువచ్చారు. మీడియా కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీని సైతం ఆక్రమించి మీడియా ప్రతినిధులు కూర్చునే అవకాశం లేకుండా చేశారు.
టీడీపీ కవ్వింపు చర్యలు
చైర్మన్ ఎన్నిక పూర్తి చేసుకుని బయటికి వస్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను చూసిన టీడీపీ నేతలు పెద్దగా అరుస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. అలాగే అధికార పార్టీ ప్రలోభాలకు లొంగని కౌన్సిలర్లను చూసిన వైఎస్సార్‌సీపీ నేతలు నైతిక విజయం తమదేనంటూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇరు పార్టీల మధ్య కొద్దిసేపు నినాదాలు హోరెత్తాయి. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీలను సముదాయించి అక్కడి నుంచి పంపించారు.
కళ్యాణదుర్గం రూరల్: ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయం చేయాలని వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. గురువారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనంతరం రంగయ్య మాట్లాడారు. అధికారం, డబ్బు ఉందనే అహంకారంతో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టారన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో 13 మంది వైఎస్సార్‌సీపీ వైపు, 11 మంది టీడీపీ వైపు ఉండగా.. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లను ప్రలోభపెట్టి చైర్మన్ ఎన్నికకు గైర్హాజరయ్యేలా చేసి, కేవలం ఎంపీ, ఎమ్మెల్యే మద్దతుతోనే టీడీపీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుందని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా నైతిక విలువలతో కూడిన రాజకీయమే చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కుర్రరాము, పరమేశ్వప్ప, లక్షన్న, పూసుల భాగ్యమ్మ, అర్చన, గోపారం హేమవతి, తలారి రాజ్‌కుమార్, తిరుమల చంద్రమ్మ, గంగమ్మ, తిప్పమ్మ, సుదీప్తి, జెడ్పీటీసీ సభ్యులు బొమ్మన్న, గుద్దెళ్ల నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, కన్వీనర్లు గోళ్లసూరి, ఎంఎస్ రాజు, హనుమంతురాయుడు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
విలువలతో కూడిన రాజకీయం చేయాలి
ఇద్దరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల
గైర్హాజరుతో టీడీపీకి చాన్స్
వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై
టీడీపీ నేతల కవ్వింపు చర్యలు
‘దుర్గం’ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గౌతమి


