బిర్సా ముండా జీవితం ఆదర్శప్రాయం
● కలెక్టర్ ఆనంద్
అనంతపురం రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జీవితం యువతకు ఆదర్శమని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్‌లో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ‘జాతీయ గౌరవ్ దివస్’ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బిర్సా ముండా అన్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి బ్రిటీష్ వారిపై పోరాటాలు చేశారన్నారు. బిర్సా ముండా చేసిన పోరాటాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 15న జాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని గిరిజనులు తమ పిల్లలను ఉన్నతంగా చదివించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రేపు కలెక్టరేట్‌లో
‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 17న కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. సమస్యపై గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. అర్జీ పరిష్కార స్థితి ఏ దశలో ఉందనే విషయాన్ని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా mee kosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.
డిసెంబర్ 13న
జాతీయ లోక్ అదాలత్
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని కోర్టుల్లో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావు ఆదేశాలతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్ శనివారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజీ చేయదగ్గ ఎక్సైజ్, క్రిమినల్ కేసుల వివరాలు సేకరించాలన్నారు. అధిక సంఖ్యలో రాజీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్.రేవతి, సీఐలు భాస్కర్ గౌడ్, రాజేంద్రనాథ్ యాదవ్, ఎన్.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


