హిందూపురంలోని పార్టీ కార్యాలయంపై జరిగిన దాడితో ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టు స్పష్టమైంది. మరీ ఇంత దౌర్జన్యమా..? ఇంత రౌడీయిజమా..? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? ఎప్పుడూ ఏదొక అంశంలో హిందూపురం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇక ఉపేక్షించబోం.. అధికారం మాకూ వస్తుంది. అప్పుడు మేమేంటో చూపెడతాం.
– ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు
అధికారం శాశ్వతం కాదు
త్వరలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు న్యాయపరంగా చేయాల్సినవి చేస్తాం. అధికారం అన్నది శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకుంటే మంచిది. మేము ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే రకం కాదు. అవినీతి అక్రమాలపై పోరాటాలు చేస్తూనే ఉంటాం.
– వేణురెడ్డి, వైఎస్సార్ సీపీ నేత
ప్రజాస్వామ్యం లేదు


