ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడి
ఎమ్మెల్యే బాలకృష్ణ పోద్బలంతోనే వైఎస్సార్ సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడులు చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. టీడీపీ నాయకులు రౌడీల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలోకి చొరబడి రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేస్తున్నా...పోలీసులు ప్రేక్షకుల్లా చూడటం తగదు. ఇప్పటికై నా పోలీసులు టీడీపీ గూండాలపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. లేకపోతే పోలీసు వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పోతుంది.
– బీఎస్ మక్బూల్ అహ్మద్,
వైఎస్సార్ సీపీ కదిరి సమన్వయకర్త


