కంది దిగుబడులపై తెగుళ్ల ప్రభావం
అనంతపురం అగ్రికల్చర్: కందికి మారుకామచ్చల పురుగు ఆశించినందున రైతులు అప్రమత్తంగా ఉండాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.మల్లీశ్వరి తెలిపారు. పురుగు ఉధృతి నివారణలో భాగంగా రోజువారీ కంది పంటను పరిశీలించాలన్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే 0.4 గ్రాములు ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 శాతం ఎస్‌జీ లేదా 0.3 మి.లీ క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 వాతం ఎస్‌సీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. తర్వాత ప్రతి 7 నుంచి 10 రోజులకోసారి పంటను పరిశీలించి మారుకామచ్చల పురుగు ఆశించిన పువ్వులు, కాయలను తీసివేయాలని, నిర్లక్ష్యం చేస్తే 40 నుంచి 60 శాతం వరకు పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలంటున్న శాస్త్రవేత్త విజయశంకరబాబు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
