ఎస్‌ఆర్‌ఐటీ అధ్యాపకులకు జాతీయ పురస్కారాలు
బుక్కరాయసముద్రం: ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలలో పని చేస్తున్న ఇద్దరు అధ్యాపకులకు జాతీయస్థాయి పురస్కారాలు లభించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బాలక్రిష్ణ తెలిపారు. కళాశాలలో అధ్యాపకులు డాక్టర్ రంజిత్‌రెడ్డి, చిన్న పుల్లయ్య పరిశోధన, విద్యా రంగాలలో అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఎక్సలెన్స్ అవార్డులు–2025 (5వ ఎడిషన్) పురస్కారాలు ప్రదానం చేశారన్నారు. బ్రైనోవిషన్ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందజేశారన్నారు. దేవ్యాప్తంగా మూడు వేల నామినేషన్లలో 1000 విశ్వ విద్యాలయాలు పాల్గొనగా.. 400 అవార్డులు ఉన్న ఈ పోటీల్లో ఎస్‌ఆర్‌ఐటీ గౌరవం దక్కించుకుందన్నారు. డాక్టర్ రంజిత్‌రెడ్డికి సాధ్య ఆచార్య పురస్కారం, చిన్న పుల్లయ్యకు జేష్ట ఆచార్య పురస్కారం అందజేశారన్నారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల యాజమాన్యం అభినందించింది.


