78 మందికి కారుణ్య నియామకాలు
● ‘సాక్షి’ కథనంతో కదలిక
అనంతపురం అర్బన్: ఏడాదిన్నరగా కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్న అంశంపై ‘కొత్త సారుపై కొండంత ఆశ ’ శీర్షికన గత నెల 21న ‘సాక్షి’లో వెలువడిన కథనంపై కలెక్టర్ ఆనంద్ వెంటనే స్పందించారు. నెల రోజుల వ్యవధిలో కారుణ్య నియామకాలు పూర్తి కావాలని సంబంధిత విభాగం అధికారులను ఆదేశించడంతో ప్రక్రియలో కదలిక వచ్చింది. మొత్తం 102 దరఖాస్తులు పరిశీలించారు. వీటిలో సమగ్రంగా ఉన్న 78 దరఖాస్తులను ఆమోదిస్తూ బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంబంధీకులకు నియామక ఉత్తర్వులను కలెక్టర్ ఆందజేసి, మాట్లాడారు. కారుణ్య నియామకం కింద వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన వారు బాధ్యతగా ఉంటూ ప్రజలకు నిజాయతీతో సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, పరిపాలనాధికారి అలెగ్జాండర్, డీటీ శ్రీనివాసమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
78 మందికి కారుణ్య నియామకాలు


