‘దివ్యాంగుడు రమేష్ పింఛనుకు
నమోదు చేస్తాం’
అనంతపురం అర్బన్: స్థానిక అరవిందనగర్‌లో నివాసముంటున్న జొన్నా రమేష్‌కు పింఛను వచ్చేలా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి తెలిపారు. ఈనెల 28న సాక్షిలో ప్రచురితమైన ‘‘ప్రజా ప్రదక్షిణ వేదిక’’ కథనంపై కమిషనర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ రమేష్‌కు పింఛను తొలగించిన అంశంపై ఆరా తీశామన్నారు. గతంలో ఆయనకు వృద్ధాప్య పింఛను మంజూరులో భాగంగా విచారణకు వెళ్లిన సమయంలో ఇంటి వద్ద లేడని, దీంతో మంజూరు కాలేదని చెప్పారు. రమేష్‌కు 2024 సెప్టెంబరు 4న వికలాంగ సర్టిఫికెట్ మంజూరైందన్నారు. కొత్త పింఛను నమోదుకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని వెల్లడించారు.
నిషేధిత డ్రగ్స్ సీజ్
పామిడి: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ కాంప్లెక్స్‌లోని బాలాజీ మెడికల్ స్టోర్‌లో మంగళవారం డ్రగ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ శాఖ ఏడీ వీర కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు అశోక్‌రెడ్డి, మాధవి తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం నిషేధించిన డ్రగ్స్ అమ్మకాలను గుర్తించి సీజ్ చేశారు. కార్యక్రమంలో సీఐలు యుగంధర్, జైపాల్‌రెడ్డి, ఈగల్ ఎస్‌ఐ హనుమంతు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అంతటా మంగళవారం తుపాను వాతావరణం నెలకొంది. ఆకాశం మ
జిల్లా అంతటా మంగళవారం తుపాను వాతావరణం నెలకొంది. ఆకాశం మ


