అర్చకుల సమస్యలు పరిష్కరించాలి
అర్చక కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. దేవదాయశాఖలో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. గత ప్రభుత్వంలో అర్చకులు రైతు భరోసా అందుకుంటే.. ఈ రెండేళ్లుగా ఆ మాటే లేకుండా పోయింది. ఇస్తున్న రూ.10 వేల వేతనానికి తల్లికి వందనం లాంటి పథకాలు ఆపడం సబబు కాదు. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
– వైపీ ఆంజనేయులు, అధ్యక్షులు, జిల్లా అర్చక సమాఖ్య
చర్యలు తీసుకుంటున్నాం
మా దృష్టికి వచ్చిన అర్చకుల సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. సాంకేతిక కారణాల వల్ల కాస్త ఇబ్బందిగా ఉంది. ఎక్కడ కూడా అర్చకులు ఇబ్బంది పడకూడదన్నదే లక్ష్యం. తల్లికి వందనం, రైతు భరోసా పథకాల వర్తింపులోనూ న్యాయం జరిగేలా చూస్తాం.
– తిరుమలరెడ్డి, ఎండోమెంటు సహాయ కమిషనర్, అనంతపురం
అర్చకుల సమస్యలు పరిష్కరించాలి


