కలగా యాజమాన్య హక్కు
అనంతపురం అర్బన్: అసైన్డ్‌భూములకు యాజమాన్య హక్కులు కల్పించి రైతులకు లబ్ధి చేకూర్చాలనే గొప్ప ఆశయంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్టీలు, మతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా రైతులందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో 20 ఏళ్లు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 96,188 మంది రైతులకు సంబంధించి 3,03,370 ఎకరాలకు ఫ్రీహోల్డ్ చేసి యాజమాన్య హక్కులు కల్పించేలా కార్యాచరణ చేపట్టింది.
పరిశీలన పేరుతో సాగదీత..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే భూములను ఫ్రీ హోల్డ్ చేసి యాజమాన్య హక్కు కల్పించే కార్యక్రమాన్ని నిలిపివేసింది. పరిశీలన పేరుతో ఎటూ నిర్ణయం తీసుకోకుండా ఏడాదిన్నరగా సాగదీస్తోంది. అంతే కాకుండా ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ రిజిస్ట్రేషన్ శాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. చివరికి అసైనీదారు చనిపోతే వారసులు మ్యుటేషన్ కూడా చేసుకోలేని దుస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. తమ కష్టం బయటికి చెప్పుకుంటే అధికార పార్టీవాళ్లు ఎక్కడ ఇబ్బంది పెడతారోనని రైతులు భయపడుతున్నారు.
వర్ణనాతీతం..
చంద్రబాబు పాలనలో రైతన్నలను కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి. అధికారంలో ఉన్నవారు ప్రజలకు తాము మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ జరుగుతున్న మంచిని ఆపేస్తే బాధితులు ఎంత నరకయాతన అనుభవిస్తారో చెప్పేందుకు ఫ్రీహోల్డ్ భూముల అంశం నిదర్శనంగా నిలుస్తోంది. 3.03 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేయడం ద్వారా 96 వేల మంది అన్ని పార్టీలు, మతాలు, కులాలు, వర్గాలకు చెందిన రైతులకు లబ్ధి చేకూరేది. అలాంటి ఫ్రీహోల్డ్ ప్రక్రియను కూటమి ప్రభుత్వం నిలిపేయడంతో బాధిత రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
ఫ్రీహోల్డ్‌కు సిద్ధం చేసింది 3,03,370.35 ఎకరాలు
రైతుల సంఖ్య 96,188
ముందుకు సాగని ఫ్రీహోల్డ్ ప్రక్రియ
పరిశీలన పేరుతో ప్రభుత్వం సాగదీత
దిక్కుతోచని 96 వేల మంది రైతులు
సమస్య చెప్పుకునేందుకూ
జంకుతున్న బాధితులు
జిల్లాలో ఫ్రీహోల్డ్ భూములు ఇలా
కలగా యాజమాన్య హక్కు


