బుగ్గకు కార్తీక శోభ
తాడిపత్రి రూరల్: స్థానిక పెన్నానది ఒడ్డున వెలసిన పార్వతీ సమేత బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు సహస్ర లింగార్చనతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవంబరు 3న రెండవ సోమవారం స్వామివారికి సప్త వర్ణ పుష్ప యాగం, 5న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటలకు గండా దీపోత్సవం, సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపోత్సవం, రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 9న స్వామి వారి ఆరుద్ర జన్మ నక్షత్రం పురస్కరించుకుని మహాగణపతి, రుద్ర చండీ యాగం, అనంతరం వన భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 10న ఉదయం కేదారేశ్వర నోము, సాయంత్రం 6 గంటలకు భక్తి సంగీతం నిర్వహించనున్నారు. 17న సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సం ఉంటుంది. 18న ఉదయం 7 గంటలకు లక్ష బిల్వార్చన, మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు ప్రదోశకాల పూజ, దశవిధ హారతులు, ఉత్సవ మూర్తుల ప్రాకారోత్సవం, అనంతరం నృత్య ప్రదర్శన ఉంటాయి. 20న సాయంత్రం 6గంటలకు భస్మాభిషేకం, భక్తులకు అల్పాహార వితరణ ఉంటుంది.


