వాల్మీకి సేవాదళ్ నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతపురం రూరల్: వాల్మీకి సేవాదళ్ నూతన కార్యవర్గాన్ని వాల్మీకి సేవాదళ్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ రవికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో ఎన్నుకున్నారు. అనంతపురం నగర యువజన విభాగం అధ్యక్షుడిగా బోయ హర్షవర్ధన్, ఉపాధ్యక్షుడిగా బోయ పురుషోత్తం, ప్రధాన కార్యదర్శిగా బోయ సాయికృష్ణ, ఉరవకొండ నియోజకవర్గ యువజన విభాగం అధక్షుడిగా శివకుమార్‌ను ఎన్నుకున్నారు.
రాయదుర్గంలో
కర్ణాటక వాసి మృతి
రాయదుర్గం టౌన్: స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలో కర్ణాటక వాసి మృతి చెందాడు. వివరాలు.. కర్ణాటకలోని గంగావతికి చెందిన మహమ్మద్ గౌస్ (50) కొన్నేళ్ల క్రితం రాయదుర్గానికి వలస వచ్చి పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుండడంతో పదేళ్ల క్రితం పిల్లలను పిలుచుకుని భార్య బెంగళూరుకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే జీవనం సాగిస్తూ అతిగా మద్యం సేవించి రోడ్లపై తిరిగేవాడు. ఈ క్రమంలో అనారోగ్యం పాలయ్యాడు. అయినా తాగుడు మానేయలేదు. శనివారం రాత్రి పాత బస్టాండ్ ప్రాంతంలో నిద్రించిన ఆయన ఆదివారం తెల్లవారు జామున విగతజీవిగా కనిపించడంతో స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ ప్రసాద్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. స్థానికంగానే ఉన్న అతని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఏపీఎంఎస్ వాచ్‌మెన్ దుర్మరణం
యాడికి: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఏపీ మోడల్ స్కూల్ (ఏపీఎంఎస్) వాచ్‌మెన్ దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన పుల్లయ్య (52)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానిక ఏపీఎంఎస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి డ్యూటీకి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి స్కూటీపై బయలుదేరాడు. సుంకులమ్మ ఆలయం సమీపంలోకి చేరుకోగానే వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన పుల్లయ్య తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. గమనించిన స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు మండల కేంద్రంలోకి ప్రవేశించిన వాహనాన్ని అడ్డుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, పుల్లయ్య మృతి విషయం తెలియగానే మోడల్‌స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
మైలారంపల్లిలో సుత్తి తల పాము
ఉరవకొండ: మైలారంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో ఓ వింత పాము ఆదివారం కనిపించింది. ఈపాము తల సుత్తి ఆకారంలో ఉండటాన్ని గమనించిన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేసుకున్న అటవీశాఖ సిబ్బంది హ్యామర్‌హెడ్ స్నేక్‌గా గుర్తించారు. ఈ జాతి పాములకు శరీరరం అంతా విషం ఉంటుందని, ఒక్కకాటుతో చనిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఈరకం పాములు కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.
వాల్మీకి సేవాదళ్ నూతన కార్యవర్గం ఎన్నిక
వాల్మీకి సేవాదళ్ నూతన కార్యవర్గం ఎన్నిక


