అరాచకాలు ఇప్పుడు గుర్తొచ్చాయా? | - | Sakshi
Sakshi News home page

అరాచకాలు ఇప్పుడు గుర్తొచ్చాయా?

Nov 1 2025 7:40 AM | Updated on Nov 1 2025 7:40 AM

అరాచకాలు ఇప్పుడు గుర్తొచ్చాయా?

అరాచకాలు ఇప్పుడు గుర్తొచ్చాయా?

అనంతపురం ఎడ్యుకేషన్‌: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై ఏరోజూ మాట్లాడని సీపీఐకి ఈరోజు పాపంపేట భూముల సమస్య గుర్తుకు వచ్చిందా అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాపంపేట ప్రాంతంలోని అదే శోత్రియం భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా 14 ఇళ్లను కూల్చివేసినప్పుడు సీపీఐ ఎక్కడికి వెళ్లిందన్నారు. ఇదే నియోజకవర్గంలో మజ్జిగ లింగమయ్యను హత్య చేసినప్పుడు ఎక్కడకి వెళ్లారన్నారు. 14 ఏళ్ల దళిత బాలికను నెలల తరబడి పాశవికంగా అత్యాచారం చేస్తే సీపీఐ పార్టీ ఎక్కడికి పోయిందని నిలదీశారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్‌ వేయడం ద్వారా ఇదే నియోజకవర్గంలో లక్షలాది ఎకరాలు బీళ్లుగా మారిపోతుంటే ఏమైపోయారని నిలదీశారు. పాపంపేట భూముల కబ్జా వ్యవహారంతో ఈరోజు పరిటాల కోటలు బీటలు పారాయన్నారు. వారి గౌరవం మసకబారిందన్నారు. వారి నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో వారిపై ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు సీపీఐ నాయకులు వస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేశారు. సీపీఐ నాయకులు ఈ ప్రాంతంలో గతంలో చాలా ఎన్నికల్లో పరిటాల సునీతకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. తాను కమ్యూనిస్ట్‌ పార్టీని, సిద్ధాంతాలను గౌరవిస్తానని, అయితే సిద్ధాంతాలు లేని వ్యక్తులను గౌరవించలేనని స్పష్టం చేశారు. 14 ఇళ్లను కూల్చివేసిన రోజు బాధితులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలిచిందన్నారు. తాము కోర్టుకెళ్లి స్టే తెచ్చి స్థలాలను నిలబెట్టామన్నారు. కచ్చితంగా పాపంపేట భూములపై న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు. ఒక్క సెంటు భూమి జోలికి వచ్చినా తరిమితరిమి కొడతామని హెచ్చరించారు.

అండగా నిలిచింది తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డే

2019లో మా ఇళ్లను కూల్చి వేస్తామని అధికారులు వస్తే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అడ్డుకున్నారని విద్యారణ్యనగర్‌ ఇళ్ల కూల్చివేత బాధితులు తెలిపారు. ఐదేళ్ల పాటు ఒక ఇటుక కూడా తొలగించకుండా చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పాత ఆర్డర్లతో బలవంతంగా కూల్చివేశారన్నారు. తాము రోడ్డున పడితే ఎమ్మెల్యే గానీ, ఇతర అధికార పార్టీ నాయకులు గానీ కన్నెత్తి చూడలేదన్నారు. ఇళ్లు కూల్చేసినరోజు బీజేపీ, జనసేన, టీడీపీ, సీపీఐ ఎక్కడికిపోయాయన్నారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చొరవతోనే కోర్టులో స్టేటస్‌కో తెచ్చుకున్నామన్నారు. సమావేశంలో అనంతపురం రూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్‌, వైస్‌ ఎంపీపీ కృష్ణారెడ్డి, నాయకులు బి.గోపాల్‌రెడ్డి, ఈశ్వరయ్య, మాదన్న, నారాయణరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సందీప్‌యాదవ్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

14 ఇళ్ల కూల్చివేత కనిపించలేదా?

మజ్జిగ లింగమయ్యను హత్య చేసినపుడు ఎక్కడికి పోయారు?

దళిత బాలికను పాశవికంగా అత్యాచారం చేస్తే ఏమైపోయారు?

పాపంపేట ఉద్యమంలో పాలు పంచుకోవడానికి వస్తున్నారా.. పరిటాల సునీతపై వ్యతిరేకత తగ్గించడానికా?

సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణను ప్రశ్నించిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement