జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.
రాయితీ పప్పుశనగకు
స్పందన నిల్
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ సంయుక్తంగా ఆలస్యంగా చేపట్టిన రాయితీ పప్పుశనగ విత్తన పంపిణీకి రైతుల నుంచి స్పందన కనిపించడం లేదు. పప్పుశనగ సాగు చేసే నల్లరేగడి కలిగిన మండలాల్లో గురువారం ఆర్‌ఎస్‌కేలో రిజిష్ట్రేషన్లు మొదలు పెట్టారు. ఈ రెండు రోజుల్లో 160 క్వింటాళ్లకు 140 మంది వరకు రైతులు రిజిష్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం పుట్లూరు, ఉరవకొండ మండలాలకు 350 క్వింటాళ్లు విత్తనం సరఫరా చేసినట్లు తెలిపారు. గతేడాది 28 వేల క్వింటాళ్లు కేటాయించగా.. ఈసారి 14 వేల క్వింటాళ్లకు కుదించారు. అలాగే గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 40 శాతం రాయితీ ఇవ్వగా కూటమి సర్కారు 25 శాతానికి తగ్గించేసింది. బహిరంగ మార్కెట్‌లో లభిస్తున్న ధరలకు... ప్రభుత్వం ప్రకటించిన ధరలకు పెద్దగా వ్యత్యాసం లేదని రైతులు చెబుతున్నారు. కనీసం అక్టోబర్ మొదటి వారంలో పంపిణీ మొదలు పెట్టి ఉన్నా కొంత వరకు ప్రయోజనంగా ఉండేదని చెబుతున్నారు. నెల రోజుల ఆలస్యంగా విత్తన పంపిణీ మొదలు పెట్టడంతో సొంతంగా బయటినుంచి సమకూర్చుకున్నామని అంటున్నారు.
న్యాయవాది నిత్య విద్యార్థే
అనంతపురం: న్యాయవాది నిత్య విద్యార్థేనని, న్యాయశాస్త్రంపై బలమైన అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమరావు అన్నారు. అనంతపురంలోని విజయనగర లా కళాశాలలో శుకవ్రారం ‘గేట్‌వే సెలబ్రేషన్స్ న్యూ వేవ్ ’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, వృత్తిలో రాణించాలంటే నిరంతర తపన, పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. నూతన అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా అదనపు న్యాయమూర్తి సి.సత్యవాణి మాట్లాడుతూ తాము విద్యార్థి దశలో లేని సదుపాయాలు నేటితరం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. లా గ్రాడ్యుయేట్లకు వృత్తిలో ఎన్నో మెరుగైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఆలూరి రామిరెడ్డి, కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ హెచ్.రాఘవేంద్రచార్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమరావు


