ఎకై ్సజ్ సురక్ష యాప్‌తో నకిలీ మద్యానికి అడ్డుకట్ట
అనంతపురం సెంట్రల్: ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యానికి అడ్డుకట్ట పడుతుందని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, సూపరింటెండెంట్ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అనంతపురంలోని పలు మద్యం దుకాణాలు, బార్ల వద్ద సురక్షయాప్‌పై అవగాహన కల్పించారు. మద్యం బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ణు స్కాన్ చేయడం ద్వారా అది నకిలీదా? లేదా అసలైనదా తెలిసిపోతుందన్నారు. ప్రతి ఒక్కరూ పరిశీలించుకున్న తర్వాతనే మద్యం కొనుగోలు చేయాలని కోరారు. షాపు నిర్వాహకులు కూడా యాప్ ద్వారానే విక్రయాలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాకు చేరిన 475
మెట్రిక్ టన్నుల యూరియా
అనంతపురం అగ్రికల్చర్: మద్రాసు ఫర్టిలైజర్స్ కంపెనీ నుంచి 475 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్‌పాయింట్‌కు ఆదివారం వ్యాగన్ల ద్వారా చేరిన యూరియా బస్తాలను ఆయన పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్‌కు 325 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 150 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు.
వివాహిత అదృశ్యం
రాప్తాడు రూరల్: అత్తారింటికి బయలుదేరిన వివాహిత కనిపించకుండా పోయింది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం కొడిమి గ్రామానికి చెందిన శివప్రసాద్ కుమార్తె మహేశ్వరికి బళ్లారి సమీపంలోని సిరిగెరికి చెందిన గణేష్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇటీవల పుట్టింటికి వచ్చిన మహేశ్వరి ఈ నెల 22న అత్తారింటికి వెళుతున్నట్లు చెప్పి బయలుదేరారు. అయితే అత్త గారి ఊరికి మాత్రం చేరుకోలేదు. ఆందోళన చెందిన ఇరుకుటుంబాల సభ్యులు వివిధ ప్రాంతాల్లో గాలించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో తండ్రి శివప్రసాద్ ఆదివారం చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.


