పండగ పూట విషాదం | - | Sakshi
Sakshi News home page

పండగ పూట విషాదం

Oct 20 2025 7:50 AM | Updated on Oct 20 2025 7:50 AM

పండగ

పండగ పూట విషాదం

నల్లమాడ: దీపావళి పండగ పూట సంతోషంగా గడపాల్సిన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని గోపేపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో నల్లమాడకు చెందిన ఇ.లక్ష్మణ సాయి (19), అరుణ్‌కుమార్‌ (19) అక్కడికక్కడే మృతిచెందారు. చారుపల్లి బన్నీ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, మృతుల సమీప బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికుడైన వెంకటనారాయణ కుమారుడు లక్ష్మణ సాయి, కూరగాయల వ్యాపారి కుళ్లాయమ్మ కుమారుడు అరుణ్‌కుమార్‌, లేట్‌ గంగులప్ప కుమారుడు చారుపల్లి బన్నీ ముగ్గురు మంచి స్నేహితులు. స్థానిక గంగా థియేటర్‌ సమీపంలో ఒకే వీధిలో నివాసం ఉంటున్నారు. లక్ష్మణ సాయి ఇంటర్‌, అరుణ్‌కుమార్‌, బన్నీ పదో తరగతి వరకు చదివి..అనంతరం చదువు మానేశారు. బన్నీ కొన్ని నెలల క్రితం బెంగళూరుకు వలస వెళ్లి ఓ ప్రైవేట్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు తెలిసింది. లక్ష్మణ సాయి, అరుణ్‌కుమార్‌ ఇంటి వద్దనే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవారు. చారుపల్లి బన్నీ బెంగళూరు నుంచి రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. శనివారం రాత్రి నల్లమాడలోని షిర్డీ సాయిబాబా గుడి వద్ద ఇతరులు చిన్నమ్మ కథ నాటకం ఏర్పాటు చేశారు. లక్ష్మణ సాయి, అరుణ్‌కుమార్‌, చారుపల్లి బన్నీ ముగ్గురూ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు చిన్నమ్మ కథ నాటకాన్ని తిలకించారు.

బస్సు ఎక్కిద్దామని బయలుదేరి..

నాటకం నుంచి వచ్చిన తర్వాత.. బన్నీ బెంగళూరు వెళ్లడానికి కదిరిలో బస్సు ఎక్కించడానికి ముగ్గురూ కలిసి ఒకే ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. కదిరికి వెళ్లారో లేక ఏదైనా కారణంతో మార్గమధ్యం నుంచి ఇంటికి తిరుగుముఖం పట్టారో తెలియదు కానీ గోపేపల్లి వద్ద రోడ్డు మలుపులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. లక్ష్మణ సాయి, అరుణ్‌కుమార్‌ ఎగిరి సమీపంలోని బండరాళ్ల మీద పడటంతో ఇరువురికీ తల, ఛాతిపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన చారుపల్లి బన్నీని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. సీఐ నరేంద్రరెడ్డి తమ సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పంచనామా అనంతరం ఇదేరోజు సాయంత్రం లక్ష్మణ సాయికి నల్లమాడలో, అరుణ్‌కుమార్‌కు స్వగ్రామం నల్లసింగయ్యగారిపల్లిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మృతులిద్దరూ ఏకై క సంతానం కావడంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది.

ద్విచక్ర వాహనం

అదుపుతప్పి చెట్టుకు ఢీ

ఇద్దరు యువకుల దుర్మరణం

మరొకరికి

తీవ్ర గాయాలు

పండగ పూట విషాదం 1
1/2

పండగ పూట విషాదం

పండగ పూట విషాదం 2
2/2

పండగ పూట విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement