
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం
బుక్కరాయసముద్రం: శింగనమల నియోజక వర్గంలో బాధిత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ మంత్రి శైలజనాథ్ భరోసానిచ్చారు. బీకేఎస్ మండలం చెదుల్ల గ్రామంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్త వన్నూరప్పను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారని సోమవారం పోలీస్ స్టేషన్‌లో బాధితులు పిర్యాదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా పోలీసులు అక్రమ కేసులు బనాయించి స్టేషన్‌కు రావాలని బెదిరిస్తున్నారని వన్నూరప్ప భార్య వాపోయింది. స్పందించిన శైలజనాథ్ వెంటనే పీఎస్‌కు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. ప్రజల పక్షాన నిలిచి బాధితులకు న్యాయం చేయాలని, దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు చట్ట బద్దంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంతరెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, చెదుల్ల సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, పార్వతి, మాజీ జెడ్పీటీసీ గువ్వల శ్రీకాంతరెడ్డి, బండ్లపల్లి ప్రతాపరెడ్డి, కాటమయ్య, నరేష్, పూల నారాయణస్వామి, చికెన్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి శైలజనాథ్