
పూజారి ముసుగులో గంజాయి విక్రయం
● ఇద్దరి అరెస్ట్..
4 కిలోల గంజాయి స్వాధీనం
గుంతకల్లు: ఆలయ పూజారి ముసుగులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు మరొకరిని ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఎకై ్సజ్ సీఐ శివసాగర్ వెల్లడించారు. సోమవారం గుంతకల్లులోని హనుమన్ సర్కిల్‌లో తనిఖీలు చేపట్టిన సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వెంటనే అడ్డుకుని పరిశీలించారు. వారి వద్ద 4 కిలోల ఎండు గంజాయి గుర్తించి అదుపులోకి తీసుకుని ఎకై ్సజ్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఏలూరు జిల్లా వెంకటాపురంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న పూజారి సురేష్‌బాబు కుమారుడు తిరునగరి మోహన్‌సుందర్ జల్సాలకు అటువాటు పడి పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకుని గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామ రామాలయంలో అర్చకుడిగా చేరాడు. ఈ క్రమంలో ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి అబ్బేదొడ్డికి చెందిన సాయిరామ్ అలియాస్ గంజాయి సాయి ద్వారా గుత్తి, గుంతకల్లు పట్టణాల్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు.
ప్రమాదంలో వ్యక్తి మృతి
బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని నార్పల క్రాస్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నార్పలకు చెందిన శివస్రసాద్ (35) వ్యక్తిగత పనిపై సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరాడు. బీకేఎస్ శివారున నార్పల క్రాస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న ఆటో బోల్తాపడింది. ఆ సమయంలో వెనుకనే ఉన్న శివప్రసాద్ వేగాన్ని నియంత్రించుకోలేక బోల్తాపడిన ఆటోను ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే 108 అంబులెన్స్‌లో అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు. చికిత్సకు స్పందించక మృతిచెందాడు. ఘటనపై బీకేఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్రాక్టర్ ఎక్కబోతూ...
పెద్దపప్పూరు: ట్రాక్టర్ ఎక్కబోతూ కాలు జారి కిందపడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... మండలంలోని నామనాంకపల్లికి చెందిన నారాయణమ్మ (70)కు ముగ్గురు సంతానం కాగా, చిన్న కుమారుడి వద్ద ఉంటూ వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తోంది. సోమవారం కూలి పని కోసం వెళ్లిన ఆమె సాయంత్రం వర్షం కురుస్తుండడంతో కూలీలందరితో కలసి ఇంటికి వెళ్లేందుకు ట్రాక్టర్ వద్దకు చేరుకుంది. ట్రాక్టర్ ఎక్కబోతుండగా కాలికి అయిన బురద కారణంగా జారి కిందపడింది. ఆ సమయంలో ఆయుపట్టుకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టిప్పర్ ఢీకొని...
తాడిపత్రి రూరల్: టిప్పర్ ఢీకొని ఓ ఆటో డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... యల్లనూరుకు చెందిన కుళ్లాయప్ప (38) ఉపాధి కోసం కుటుంబసభ్యులతో కలిసి తాడిపత్రికి వలస వచ్చి షేర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆటోలో వెళుతుండగా చుక్కలూరు క్రాస్ వద్దకు చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ టిప్పర్‌తో సహా ఉడాయించాడు. అదే సమయంలో మరో ఆటోలో వెళుతున్న సోదరి కృష్ణవేణి గుర్తించి వెంటనే కుళ్లాయప్పను తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు.

పూజారి ముసుగులో గంజాయి విక్రయం

పూజారి ముసుగులో గంజాయి విక్రయం