ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక

Jul 18 2025 5:12 AM | Updated on Jul 18 2025 5:12 AM

ఆంధ్ర

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక

అనంతపురం: ఆంధ్రా అండర్‌–23 క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌ ఎంపిక గురువారం ముగిసింది. అనంతపురానికి చెందిన ఆరుగురికి చోటు దక్కింది. వీరిలో మచ్చా కె.దత్తారెడ్డి, పి.అర్జున్‌ టెండూల్కర్‌, జి.మల్లికార్జున, ఎస్‌.మహమ్మద్‌ కమిల్‌, టి. హేంద్ర రెడ్డి, ఎం.దీపక్‌ ఉన్నారు. మచ్చా దత్తారెడ్డి కుడిచేతి ఓపెనర్‌గా, వికెట్‌ కీపర్‌గా రాణిస్తున్నాడు. ఆంధ్ర అండర్‌ 23 రంజీ టోర్నీలో ప్రతిభ చాటాడు. అలాగే కుడిచేతి ఓపెనర్‌గా, ఆఫ్‌ స్పిన్నర్‌గా రాణిస్తున్న పి.అర్జున్‌ టెండూల్కర్‌ ఇప్పటికే ఆంధ్ర అండర్‌ 23, 19 జట్లలో ప్రాతినిథ్యం వహించారు. ఎడమ చేతి వాటం స్పిన్నర్‌ అయిన మల్లిఖార్జునకు అంతర జిల్లా మ్యాచ్‌ల్లో పది వికెట్లు తీసిన రికార్డు ఉంది. అలాగే ఎడమ చేతి మీడియ పేస్‌ బౌలర్‌ దీపక్‌ సైతం అంతర్‌ జిల్లా మ్యాచ్‌లో 11 వికెట్లు సాధించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కమిల్‌ ఎడమ చేతి స్పిన్నర్‌. ఎడమ చేతి వాటం మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరుస్తున్నాడు. మహేంద్ర రెడ్డి కుడిచేతి వాటం మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌. అండర్‌–19, అండర్‌–23 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, మరో అర్ధసెంచరీ సాధించాడు.

ఆలయ పునరుద్ధరణ విషయంలో

అభ్యంతరాలు తెలపండి

‘అనంత’ కాశీవిశ్వేశ్వరాలయం ఈఓ నాగేంద్రుడు

అనంతపురం కల్చరల్‌: జిల్లా కేంద్రంలో వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన మొదటి రోడ్డు కాశీవిశ్వేశ్వరాలయం పునరుద్ధరణ విషయంలో ఎవరికై నా అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఆలయ ఈఓ నాగేంద్రుడు కోరారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఆయన గురువారం ఆలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆలయం పాతబడినందున పునరుద్ధరణకు భక్తమండలి సభ్యులు, దేవాదాయశాఖ సిబ్బంది తీర్మానించారని గుర్తు చేశారు. ఇప్పటికే రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అయితే ఎవరికై నా అభ్యంతరాలున్నా, సలహాలు.. సూచనలివ్వాలనుకున్నా 15 రోజుల్లోపు తెలపాలన్నారు. కార్యక్రమంలో భక్తమండలి సభ్యులు పాల్గొన్నారు.

బంగారు గొలుసు అపహరణ

గుంతకల్లు టౌన్‌: స్థానిక హనుమేష్‌నగర్‌ ఎల్‌ఐసీ కార్యాలయం ప్రాంతంలో గురువారం రాత్రి చైన్‌స్నాచింగ్‌ జరిగింది. తన సోదరి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న మల్లీశ్వరి అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కొని ఉడాయించాడు. బాధితురాలు తెలిపిన మేరకు.. మల్లీశ్వరి కర్నూలు జిల్లా మద్దికెర సుబ్రమణ్యస్వామి ఆలయంలో పనిచేస్తోంది. పనిపై తన ఇంటి నుంచి పక్క వీధిలో ఉంటున్న తన అక్క సులోచన ఇంటికి గురువారం రాత్రి నడుచుకుంటూ వెళుతుండగా బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని ఉడాయించాడు. ఈ ఘటనతో ఆమె మెడపై గాయమైంది. గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను విచారించారు. చుట్టుపక్కల గాలించినా దుండగుడి ఆచూకీ లభ్యం కాలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు గుంతకల్లు వన్‌టౌన్‌ సీఐ మనోహర్‌ తెలిపారు.

వ్యక్తి దుర్మరణం

గోరంట్ల (సోమందేపల్లి): వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం గుంతపల్లికి చెందిన నరసింహారెడ్డి గురువారం సొంత పనిపై గోరంట్లకు వెళ్లాడు. పని ముగించుకున్న అనంతరం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన గుంతపల్లి సమీపంలోకి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ వాహనం నిలపకుండా దూసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న గోరంట్ల పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక 
1
1/6

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక 
2
2/6

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక 
3
3/6

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక 
4
4/6

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక 
5
5/6

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక 
6
6/6

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement