
ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంకండి
రాయదుర్గం టౌన్: కూటమి పాలనలో దగాపడిన ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయదుర్గం ప్రాంతంలోని మురడి, నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయాల దర్శనం కోసం మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన ఆయన స్థానిక మెట్టు గోవిందరెడ్డి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథరెడ్డితో కలసి స్థానిక నాయకులతో కాసేపు మాట్లాడారు. ఏడాది కూటమి పాలన మొత్తం మోసాల మయమన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్కు చెరిపితే చెరిగి పోయేది కాదన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సొంతంగా ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేని చంద్రబాబు... జగన్ ప్రవేశపెట్టిన పథకాలనే తమవిగా చెప్పుకునే దౌర్బగ్యస్థితికి దిగజారారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ మేకల శ్రీనివాసులు, చేనేత విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పొరాళ్ల శివకుమార్, కౌన్సిలర్లు పొరాళ్ల గోవిందరాజులు, వీరభద్రరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు శ్రీనివాసులు, మండల కోఆప్షన్ సభ్యుడు దిలావర్‌బాష, మైనారిటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి తాశ బషీర్ అహ్మద్, పట్టణ కార్యదర్శులు, ఆంజనేయులు, సత్యనారాయణ, వార్డు ఇన్‌చార్జ్‌లు గౌని శ్రీరామిరెడ్డి, రామాంజనేయులు, గోనబావి నిజాముద్దీన్, కార్యవర్గ సభ్యుడు జిలాన్, బంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి పిలుపు