
గిరినాథ్‌కు రూ.10 లక్షలు
అనంతపురం: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025 వేలం ప్రక్రియ విశాఖపట్నంలో సోమవారం రాత్రి ముగిసింది. ఏపీఎల్ సీజన్–4 కోసం 520 మంది క్రికెటర్లు వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అనంతకు చెందిన 11 మంది క్రీడాకారులకు అవకాశం దక్కింది. అత్యధికంగా పి.గిరినాథరెడ్డిని రూ.10.05 లక్షలతో రాయల్స్ ఆఫ్ రాయలసీమ (ఆర్‌ఆర్) దక్కించుకుంది. రూ.7.50 లక్షలకు బి. వినయ్‌కుమార్‌ను అమరావతి రాయల్స్ సొంతం చేసుకుంది. రూ.4.20 లక్షలకు కోగటం హనీష్ వీరారెడ్డిని సింహాద్రి వైజాగ్ లయన్స్ కై వసం చేసుకుంది. పి.అర్జున్ టెండూల్కర్‌ను రూ.1.20 లక్షలకు కాకినాడ కింగ్స్, మచ్చా కె.దత్తారెడ్డిని రూ.60 వేలకు తుంగభద్ర వారియర్స్, జి.మల్లికార్జునను రూ.90 వేలతో అమరావతి రాయల్స్, సంతోష్‌కుమార్‌ను రూ.60 వేలతో అమరావతి రాయల్స్, ఎస్‌ఎం కమిల్‌ను రూ.50 వేలతో సింహాద్రి వైజాగ్ లయన్స్, ఎన్.మనోజ్‌కుమార్‌ను రూ.30 వేలతో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, డీబీ ప్రశాంత్‌ను రూ.2.20 లక్షలు, ఎం.దీపక్‌ను రూ.30 వేలతో తుంగభద్ర వారియర్స్ దక్కించుకున్నాయి.
ఏపీఎల్‌లో అత్యధిక ధరతో వేలం
జిల్లాకు చెందిన 11 మంది క్రికెటర్లకు అవకాశం

గిరినాథ్‌కు రూ.10 లక్షలు

గిరినాథ్‌కు రూ.10 లక్షలు