తల్లిదండ్రుల్లో మార్పు రావాలి | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల్లో మార్పు రావాలి

Jul 15 2025 6:31 AM | Updated on Jul 15 2025 6:31 AM

తల్లి

తల్లిదండ్రుల్లో మార్పు రావాలి

వారం క్రితం అనంతపురం రూరల్‌ పరిధిలోని నారాయణపురం చెక్‌డ్యాం సమీపంలో తపోవనం హైస్కూల్‌ పిల్లలు ఐదుగురు మద్యం తాగుతున్నారు. ఆ బ్యాచ్‌లోని ఓ విద్యార్థి తండ్రి వీరి తతంగాన్ని కనిపెట్టాడు. తన కుమారుడిని పట్టుకొచ్చి బాగా కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి అందరి పేర్లూ చెప్పాడు. విస్కీ తాగినట్టు వెల్లడించాడు.

అనంతపురం నగరంలోని పొట్టిశ్రీరాములు పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి.. ఇటీవల స్కూల్లో టీసీ తీసుకుని 3వ రోడ్డులో ఉన్న ఓ హైస్కూల్‌లో చేరాడు.బడిలో ఈ విద్యార్థి ఇటీవల గంజాయి తాగుతుండగా ఉపాధ్యాయుడు గుర్తించాడు. తల్లిదండ్రులను పిలుస్తా అని హెచ్చరిస్తే.. ‘‘పిలువు, నన్ను వాళ్లేం చేయగలరు’’ అంటూ విద్యార్థి ఎదురుతిరిగే సరికి ఉపాధ్యాయుడు భయపడి విషయాన్ని అంతటితో వదిలేశాడు. విద్యార్థుల్లో పెడ ధోరణలు ఎంతగా పెరిగాయో ఈ రెండు ఘటనల ద్వారా అర్థం చేసుకోవచ్చు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్న విపరీత ధోరణులు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ హైస్కూళ్లలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులు కూడా తమకెందుకులే అని పట్టించుకోకపోవడం తదితర కారణాలతో పిల్లలు పెడదారి పడుతున్నట్లుగా తెలుస్తోంది.

14 ఏళ్లకే మద్య సేవనం...

తపోవనం హైస్కూలు విద్యార్థులు మద్యం సేవించిన ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ముగ్గురు, ఎనిమిదో తరగతి చదువుతున్న వారు ఇద్దరు ఉన్నట్లు తెలుసుకుని పలువురు విస్తుపోతున్నారు. మరోవైపు జిల్లాలో కొన్ని చోట్ల విద్యార్థులు పాఠశాలలకు గంజాయి తెచ్చుకుని సేవిస్తున్నారు. మరికొన్ని చోట్ల సెల్‌ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూస్తూ గడుపుతున్నారు. కో ఎడ్యుకేషన్‌ ఉన్నచోట బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ ప్రభుత్వ స్కూల్‌లో 9వ తరగతి బాలిక ఓ బాలుడికి ప్రేమలేఖ రాసిన ఉదంతం బయటపడింది. ఈ క్రమంలో పిల్లలను స్కూళ్లకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఉపాధ్యాయుల్లో ఉదాసీన వైఖరి

పిల్లలను ఏమంటే ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న భయంతో ఉపాధ్యాయులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది టీచర్లే క్రమశిక్షణ తప్పి క్లాసులకు వస్తున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. సమయానికి స్కూలుకు వెళ్లకపోవ డం, వెళ్లినా క్లాసులు తీసుకోకపోవడం విద్యార్థులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి కారణమవుతోంది. ఇక పిల్లల తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లి ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకుంటుండడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాలు లేక శాపంగా పరిణమిస్తోంది.

విద్యార్థుల్లో వింత పోకడ

ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులే ఎక్కువగా పక్కదారి

వారం క్రితం నారాయణపురం వద్ద లిక్కర్‌ తాగుతూ దొరికిన ఐదుగురు

మరో ప్రభుత్వ స్కూల్లో 9వ తరగతి విద్యార్థి గంజాయి సేవనం

ఎక్కువగా అర్బన్‌ ప్రాంతాల్లో ఇలాంటి విపరీత ఘటనలు

ఉదాసీనంగా ఉపాధ్యాయులు

పిల్లల్లో పెడధోరణులను కాండాక్ట్‌ డిజార్డర్‌ అంటారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన కారణం. తల్లిదండ్రు లకు మద్యం అలవాటు ఉన్నా ఇలా జరుగుతుంది. మొబైల్‌ ఫోన్‌లు, సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల కూడా పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రుల ద్వారానే పిల్లల్లో పరివర్తన రావాలి.

–డాక్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్‌,

మానసిక వైద్య నిపుణులు, అనంతపురం

తల్లిదండ్రుల్లో మార్పు రావాలి 1
1/2

తల్లిదండ్రుల్లో మార్పు రావాలి

తల్లిదండ్రుల్లో మార్పు రావాలి 2
2/2

తల్లిదండ్రుల్లో మార్పు రావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement