
హెచ్చెల్సీకి నవంబర్ నెలాఖరు వరకూ నీరు
● టీబీ డ్యాం ఎస్‌ఈ నారాయణ నాయక్
బొమ్మనహాళ్: హెచ్చెల్సీకి నవంబర్ నెలాఖరు వరకు తుంగభద్ర జలాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టీబీ డ్యాం ఎస్‌ఈ నారాయణ నాయక్ తెలిపారు. సోమవారం బొమ్మనహాళ్ మండలం ఆంధ్రా సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద కాలువను, రెగ్యులేటర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టిందన్నారు. ఇటీవల డ్యాం నుంచి 1,400 క్యూసెక్కుల నీటిని హెచ్చెల్సీకి వదిలామన్నారు. 105వ కిలోమీటర్ వద్దకు 500 క్యూసెక్కుల మేర వస్తున్నట్లు తెలిపారు. నవంబర్‌లో వర్షాలు వస్తే హెచ్చెల్సీకి నీటి వాటా పెంచుతామన్నారు. ఆంధ్రాలో అత్యవసర మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో నీటిని తీసుకునేందుకు ఆలస్యం కావొచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్‌డీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జేఈ రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పది, ఇంటర్ ప్రవేశాలకు 16న కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సీట్ల భర్తీకి ఈనెల 16న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సమన్వయ అధికారి జయలక్ష్మీ తెలిపారు. కురుగుంట స్కూల్‌లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పదో తరగతికి సంబంధించి ఉరవకొండ స్కూల్‌లో ఎస్టీ–1, బీసీ–1, ఓసీ–1, హిందూపురం బాలికల పాఠశాలలో ఎస్సీ–7, అమరాపురంలో ఎస్టీ–1, ఓసీ–1, మలుగూరులో ఎస్సీ–2, ఎస్టీ–1 ఖాళీలున్నాయన్నారు. సీనియర్ ఇంటర్‌లో ఉరవకొండ ఎస్సీ– 48, ఎస్టీ–3, బీసీ–3, ఓసీ–2, నల్లమాడలో 55, కురుగుంటలో ఎస్సీ–1, ఎస్టీ–2, బీసీ–2, హిందూపురం (బాలికలు)లో ఓసీ–1, అమరాపురం ఎస్సీ–1, ఓసీ–1, మలగూరులో ఎస్సీ–19, బీసీ–1 సీటు ఖాళీ ఉందన్నారు.
16 ఎకరాల్లో పత్తి పంట దున్నేసిన రైతు
యాడికి: వర్షాభావంతో పంట చేతికి అందకుండా పోతోందనే ఆవేదనతో ఓ రైతు 16 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటను ట్రాక్టర్ సాయంతో దున్నేశాడు. యాడికి మండలం చిక్కేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైతు బాదుల్లా తనకున్న 3 ఎకరాలతో పాటు సమీపంలోని రైతులకు చెందిన 13 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాడు. పెట్టుబడి కింద రూ.2 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. వర్షం జాడ లేకపోవడంతో పంట ఎదుగుదల లేకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైన బాదుల్లా తన భార్యతో కలసి ట్రాక్టర్‌తో పత్తి పంటను తొలగించాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేత వెంకట్రామిరెడ్డి, మండల కన్వీనర్ సంజీవరాయుడు, నాయకులు అక్కడకు చేరుకుని బాదుల్లాతో మాట్లాడారు. తహసీల్దార్ ప్రతాపరెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని విన్నవిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సాంబశివుడు, ఆదినారాయణరెడ్డి, చిక్కేపల్లి గ్రామ నాయకులు అశోక్‌రెడ్డి నారాయణరెడ్డి, దేవనాథరెడ్డి, ఈశ్వరరెడ్డి, బయపురెడ్డి పాల్గొన్నారు.
అవార్డుల దరఖాస్తు
గడువు పొడిగింపు
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ ఏడాది జాతీయస్థాయి అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 16 వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ ఎం. ప్రసాద్‌బాబు తెలిపారు. పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ పొందుపరిచిన మార్గదర్శకాలు డీఈఓ బ్లాగ్‌లో ఉంచినట్లు వెల్లడించారు. దరఖాస్తు కోసం nationalawardstoteacher. education. gov. in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు. మ్యానువల్ దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ధ్రువీకరణ అధికారి ద్వారా హార్డ్‌కాపీలపై ధ్రువీకరించుకుని డీఈఓ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.

హెచ్చెల్సీకి నవంబర్ నెలాఖరు వరకూ నీరు