
● ప్రచార మత్తు..
ఎక్కడైనా కొత్త ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ‘ఏటీఎం వంద మీటర్ల దూరంలో ఉంది, పెట్రోల్ బంకు 50 మీటర్ల దూరంలో ఉంది, పోలీసు స్టేషన్ 30 మీటర్ల దూరంలో ఉంది’ అనే బోర్డులు రోడ్డు పక్కన కనిపించడం సర్వసాధారణం. అయితే ఇందుకు భిన్నంగా కళ్యాణదుర్గంలో మాత్రం టీడీపీ నేతలు ఏకంగా బళ్లారికి వెళ్లే రింగ్ రోడ్డు పక్కనే మద్యం దుకాణం 50 మీటర్ల దూరంలో ఉందంటూ బోర్డు పెట్టేశారు. దీనికి తోడు రింగ్ రోడ్డు సమీపంలో గతంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి మహాత్మాగాంధీ సర్కిల్‌గా నామకరణం చేశారు. మహాత్మునికి కూడా కనీస గౌరవం ఇవ్వకుండా విగ్రహానికి కేవలం 30 అడుగుల దూరంలోనే మద్యం దుకాణం తెరిచారు. ఇది చూసిన ప్రజాసంఘాల నాయకులు, సామాజిక వేత్తలు విస్తుపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – సాక్షి, టాస్క్‌ఫోర్స్:

● ప్రచార మత్తు..