
● అ‘పూర్వ’ సమ్మేళనం
పామిడి: స్థానిక టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1981–82లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. 43 ఏళ్ల తర్వాత రెండో సారి కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులు ప్రభాకర్, వెంకరమణప్పను ఘనంగా సత్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఒకరి బాగోగులను ఒకరు అడిగి తెలుసుకున్నారు. సామూహిక భోజనాలతో సందడి చేశారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు డీఎస్‌ఎం వరప్రసాద్, ఆసిఫ్, వెంకన్నరావు, శ్రీనివాసరావు, రాధాకృష్ణ, నగేష్, ఆర్‌ఎంపీ మైనుద్ధీన్, రమేష్, భాస్కర్, ఖాజామొహిద్ధీన్, మస్తాన్, ప్రేమ, వహిద తదితరులు పాల్గొన్నారు.