
జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం
అనంతపురం కార్పొరేషన్: జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం.. అందుకు కార్యకర్త నుంచి నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నారై కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆయన సోమవారం నగరానికి వచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలూరు సాంబశివారెడ్డిని గజమాల, పుష్పగుచ్ఛాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం కల్పించినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. పార్టీ అనుబంధ విభాగాల బలోపేతానికి, సంస్థాగత నిర్మాణాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ నేతల సహకారంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆలూరు సాంబశివారెడ్డిని కలసిన వారిలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, పామిడి వీరాంజినేయులు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంగంపేట గోపాల్‌రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులునాయక్, ఎంపీపీ రాఘవరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు విజయప్రతాప్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, నరేంద్రనాథ్‌రెడ్డి, శ్రీరామిరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, పాలే జయరాం నాయక్, ఎగ్గుల శ్రీనివాసులు, వెన్నపూస రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి