ఈ సృష్టిలో ఏ జీవికై నా తల్లిప్రేమ ఒక్కటే. తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి. ఓ వానరం కూడా తన బిడ్డను పొత్తిళ్లలో జాగ్రత్తగా ఎత్తుకుని పరిసరాలంతా తిరిగింది. ఆహారం కోసం అన్వేషించింది. తినడానికి ఏదో దొరికిన తర్వాత బిడ్డను కిందకు దించింది. కానీ నిర్జీవంగా కన్పించిన బిడ్డ వైపు తదేకంగా చూస్తూ విషాదంలో మునిగిపోయింది.ఈ దృశ్యం శుక్రవారం అనంతపురం నగర శివారులోని వడియంపేట వద్ద
– సాక్షిఫొటోగ్రాఫర్, అనంతపురం