
ఆర్డీటీ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు
ఉరవకొండ: ఆర్డీటీని కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఆర్డీటీకి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్టు (ఎఫ్‌సీఆర్‌ఏ) రెన్యూవల్ అంశంపై మంగళవారం స్థానిక ఓ కల్యాణ మంటపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌తో పాటు ప్రజాసంఘాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశ్వ మాట్లాడుతూ... కరువు పీడిత అనంతపురం జిల్లాలో ఆర్డీటీ చేపట్టిన సేవలను గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం విద్య, వైద్యం, పక్కాగృహాలు, వాటర్‌షెడ్,ఉపాధిహమీ, హార్టికల్చర్, మహిళా సాధికారితకు రూ.వందల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఆర్డీటీ సేవలు ఆగిపోతే పేదలు నష్టపోతారన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యూవల్ చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 12న ఉరవకొండలో భారీ నిరసన ర్యాలీ చేపట్టేలా నిర్ణయించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున, కృష్ణమూర్తి, అబ్బాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు బెంజిమెన్, ఏపీటీఎఫ్ హనుమప్ప, భాస్కర్, రాజేష్, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక నాయకులు మధుకర్, జైకిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నాగమల్లి ఓబులేసు, ఆపద్బాంధవ ట్రస్ట్ ప్రతినిధి మురళి, సర్పంచ్ జగదీష్, మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీలు ఏసీ ఎర్రిస్వామి, తిప్పయ్య, విద్యార్థి సంఘం నాయకుడు పురుషోత్తం, వైఎస్సార్‌సీపీ గిరిజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందునాయక్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే విశ్వ