హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుత్తి రూరల్: శ్రీపురం గ్రామంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని సర్పంచ్ ఉండ్ర రామలింగమయ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, నంద్యాల, అన్నమయ్య జిల్లాల వృషభాలు పాల్గొన్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన మస్తాన్‌యాదవ్ వృషభాలు మొదటి స్థానంలో నిలిచి రూ.30వేలు, బొమ్మనహాల్ మండలం గోవిందవాడకు చెందిన గురుస్వామి వృషభాలు రెండవ స్థానంలో నిలిచి రూ.20వేలు, లింగదల్ ఎర్రిస్వామి వృషభాలు మూడో స్థానంలో నిలిచి రూ.15 వేలు నగదు బహుమతి గెలుచుకున్నాయి. వైఎస్సార్ జిల్లా వేముల మండలం తెర్నపాడు గ్రామానికి చెందిన భువనేశ్వర్ కుమార్ వృషభాలు రూ.10వేలు, గుత్తి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మోహన్‌బాబు వృషభాలు రూ.5వేల నగదు బహుమతులు గెలుపొందాయి. కార్యక్రమంలో గ్రామస్తులు కోనా లక్ష్మణరావు, చంద్ర, లోకేష్, నామాల సందీప్ పాల్గొన్నారు.


