
బెంగళూరు–కలబురిగి మధ్య ప్రత్యేక రైలు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 28, 29వ తేదీల్లో బెంగళూరు–కలబురిగి మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 28న బెంగళూరు జంక్షన్ నుంచి రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు కలబురిగి జంక్షన్‌కు రైలు చేరుతుందన్నారు. తిరిగి 29వ తేదీ ఉదయం 9.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 8 గంటలకు బెంగళూరు జంక్షన్ చేరుకుంటుందని తెలిపారు. యలహంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, కృష్ణా, యాదగిరి, షాహాబాద్ రైల్వేస్టేషన్ల మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు.
విద్యుత్ అధికారుల
నిర్లక్ష్యానికి చిన్నారి బలి
కళ్యాణదుర్గం రూరల్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలిగొంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఈరన్న, రేణుకమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ఇటీవల ఈరన్న ఇంటి సమీపంలో విద్యుత్ తీగ కిందకు వాలింది. ఈ విషయంపై పలు మార్లు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. మంగళవారం బలంగా వీచిన గాలులకు తీగ పూర్తిగా తెగి కింద పడడంతో ఆ ప్రాంతమంతా విద్యుత్ సరఫరా అయింది. అదే సమయంలో అక్కడికి ఆడుకుంటూ వెళ్లిన ఈరన్న కుమార్తె అభినయశ్రీ (6) షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని కళ్యాణదుర్గం సీహెచ్‌సీకి తరలించగా... పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
‘నవోదయ’
ఫలితాల విడుదల
లేపాక్షి: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పరీక్షకు 7,987 మంది దరఖాస్తు చేసుకోగా, 5,492 మంది పరీక్ష రాశారు. అందులో 80 మంది అర్హత సాఽధించారని పాఠశాల ప్రిన్సిపాల్ నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం విద్యాలయ వెబ్‌సైట్ చూడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
9వ తరగతి ప్రవేశ పరీక్ష
ఫలితాలు విడుదల
లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయలో 9వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను కూడా అధికారులు విడుదల చేశారు.

బెంగళూరు–కలబురిగి మధ్య ప్రత్యేక రైలు

బెంగళూరు–కలబురిగి మధ్య ప్రత్యేక రైలు