రాయదుర్గంటౌన్: పట్టణంలోని బళ్లారి రోడ్డులో ఉన్న మూసా ఆర్‌ఎంపీ క్లినిక్‌ను వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. ఆర్‌ఎంపీ నిర్వాకంతో గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి అనుశ్రీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై స్పందించిన డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి శనివారం రాయదుర్గం చేరుకుని విచారణ చేపట్టారు. క్లినిక్‌ను సీజ్ చేశారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రిలో బాధిత తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీఎం, విద్యార్థి సంఘాల నేతలు డీఎంహెచ్‌ఓను కలిసి చిన్నారి మృతికి కారణమైన ఆర్‌ఎంపీపై చర్యలు చేపట్టడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.