● ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం ఇప్పేరులో 1,100 ఓట్లు ఉంటాయి. ఇలాంటి చిన్న ఊర్లోనే 3 బెల్టుషాపులు నడుస్తున్నాయి. 24
గంటలూ మద్యం లభిస్తోంది.
● తాడిపత్రి నియోజకవర్గం పుట్లూరు మండల పరిధిలో ఎల్లుట్ల గ్రామం ఉంది. తక్కువ జనాభా ఉన్నా 2 బెల్టుషాపులు నిరంతరం నడుస్తూనే ఉంటున్నాయి.
● రాప్తాడు నియోజకవర్గం బండమీదపల్లెలో సుమారు 10 బెల్టుషాపులు ఏర్పాటయ్యాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సొంతగ్రామం ఇది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో గ్రామాలు మద్యం మత్తులో మునిగి తేలుతున్నాయి. ప్రతి పల్లెలోనూ రెండు లేదా మూడు బెల్టుషాపులు ఏర్పాటయ్యాయి. వేళాపాళా లేకుండా 24 గంటలూ బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. దీంతో 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకూ మద్యం మత్తులోనే జోగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో బెల్టుషాపులు లేకపోవడం, మద్యం షాపులకు కచ్చితమైన వేళలుండటం వల్ల మద్యం పూర్తిగా నియంత్రణలో ఉండేది. ఇప్పుడు మద్యం షాపులకు పట్టపగ్గాలు లేవు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలవే మద్యం షాపులు కావడం, బెల్టుషాపులు టీడీపీ కార్యకర్తలకే ఇవ్వడంతో ప్రశ్నించే అధికారి లేకుండా పోయారు.
అర్బన్‌లో పర్మిట్ రూములు..
పల్లెలన్నీ బెల్టుషాపుల కారణంగా మత్తులో జోగుతుంటే పట్టణాలు పర్మిట్ రూములతో తూగుతున్నాయి. వైన్‌షాపు ఉన్న ప్రతిచోటా పర్మిట్ రూము ఏర్పాటు చేసి అక్కడే తాగిస్తున్నారు. అనంతపురంలో జిల్లా ఎస్పీ ఇంటికి కూతవేటు దూరంలోనే పర్మిట్ రూము నడుస్తున్నా అడిగేవారు లేరు. అనంతపురం అర్బన్‌లో 30 వైన్ షాపులకు పైగా ఉంటే అన్నింటా పర్మిట్ రూములు ఏర్పాటయ్యా యి. ప్రతి రూమూ బార్‌ను తలపిస్తోంది. అర్ధరాత్రి తలుపు తట్టినా అనంతపురంలో ఓ నాయకుడి వైన్‌షాపు నుంచి మద్యం లభిస్తోంది. అంతేకాదు ఉదయం 10 గంటలకు తెరవాల్సిన మద్యం షాపులు రాప్తాడు, తాడిపత్రి లాంటి నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకే తెరుస్తున్నారు.
భారీగా మద్యం వినియోగం..
జిల్లాలోనే అనంతపురం అర్బన్‌లో ఎక్కువ మద్యం వినియోగమవుతున్నట్టు తేలింది. తాజా మద్యం అమ్మకాలు పరిశీలిస్తే 33 శాతం అమ్మకాలు ఈ నియోజకవర్గ పరిధిలోనే జరిగాయి. జిల్లాలో గత ఆరు నెలల్లో రూ.444.86 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే ఒక్క అనంతపురం టౌన్‌లోనే రూ.150.46 కోట్ల వ్యాపారం జరిగింది. దీన్నిబట్టి ఇక్కడ పర్మిట్‌రూముల ప్రభావం ఎలా ఉందో అంచనా వేయొచ్చు.
మద్యం మత్తులో గ్రామాలు
ప్రతి పల్లెలో రెండు లేదా
మూడు బెల్టుషాపులు
నియోజకవర్గ కేంద్రాల్లో వైన్‌షాపులకు
అనుబంధంగా పర్మిట్‌రూములు
మెజారిటీ షాపులు
అధికార పార్టీ ఎమ్మెల్యేలవే..
అనంతపురం అర్బన్‌లో
బార్‌లను తలపిస్తున్న రూములు
ఆరు మాసాల్లో జిల్లాలో రూ.444 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు
జిల్లాలో ఇలా.. మద్యం షాపులు 136 బార్‌లు 19 బెల్టుషాపులు
జిల్లాలో ఇలా.. మద్యం షాపులు 136 బార్‌లు 19 బెల్టుషాపులు
జిల్లాలో ఇలా.. మద్యం షాపులు 136 బార్‌లు 19 బెల్టుషాపులు