
రేషన్ బియ్యం స్వాధీనం
పెద్దవడుగూరు (యాడికి): మండల కేంద్రమైన యాడికి నుంచి రాయలచెరువుకు వెళ్లే మార్గంలోని బలరామ్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని యాడికి తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి సీజ్ చేశారు. ఒక్కొక్కటి 50 కిలోల చొప్పున 1,175 బస్తాల రేషన్ బియ్యాన్ని మంగళవారం ఉదయం ఓ కంటైనర్‌లో తరలించేందుకు లోడ్ చేస్తుండగా సీఎస్‌డీటీ మారుతీప్రసాద్, ఆర్‌ఐ కిట్టప్ప, వీఆర్‌ఓలు అనిల్, శ్రావణ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా గుర్తించి నిందితులపై కేసు నమోదు చేశారు. కంటైనర్‌ను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు.