సెల్‌ఫోన్‌ చూడొద్దన్నందుకు టెన్త్‌ విద్యార్థి పరార్‌ | - | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ చూడొద్దన్నందుకు టెన్త్‌ విద్యార్థి పరార్‌

Mar 16 2025 12:30 AM | Updated on Mar 16 2025 12:28 AM

రైల్వే స్టేషన్‌లో గుర్తించిన పోలీసులు

పెనుకొండ: పరీక్షల వేళ సెల్‌ఫోన్‌ చూడవద్దని తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థి ఇంటినుంచి పరారయ్యాడు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నారాయణమ్మ కాలనీ సమీపాన నివాసముంటున్నా లికిరెడ్డి వాయునందన్‌రెడ్డి పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం నుంచి పరీక్షలు మొదలవుతాయి. అయితే శుక్రవారం రాత్రి సెల్‌ఫోన్‌ చూస్తుండడంతో తండ్రి నాగార్జునరెడ్డి గమనించి గట్టిగా మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన వాయునందన్‌రెడ్డి ఇంటినుంచి పరారయ్యాడు. కుమారుడు ఎంత సేపైనా ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెదికిన తండ్రి, ఇతర కుటుంబసభ్యులు అదేరోజు రాత్రి 11 గంటల తర్వాత ఎస్‌ఐ వెంకటేశ్వర్లును కలసి ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ వెంటనే పోలీసు సిబ్బందితో బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, జాతీయ రహదారి, పలు హోటళ్ల వద్ద గాలింపు చేపట్టారు. చివరకు రైల్వేస్టేషన్‌లో దాక్కుని ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని, విద్యార్థిని మందలించి చక్కగా చదువుకోవాలని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం తల్లిదండ్రులకు బాలుడిని అప్పగించారు.

చెట్టుపైనుంచి పడి కూలీ మృతి

కుందుర్పి: శ్రీమజ్జనపల్లికి చెందిన వ్యవసాయ కూలీ కెంచయ్య (42) శనివారం చింతచెట్టుపైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కెంచయ్య రోజువారీ కూలి పనుల్లో భాగంగా శనివారం ఉదయం చింతకాయలు కోయడానికి సమీపంలోని పుట్రాళ్లపల్లి వద్దకు వెళ్లాడు. అక్కడ చింతకాయలు కోసే క్రమంలో కాలుజారి చెట్టుపైనుంచి కింద పడ్డాడు. తలకు, మర్మావయవాలకు తీవ్రగాయాలవడంతో వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కెంచయ్యకు భార్య నేత్ర, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement