‘దుర్గం’లో దోపిడీ దొంగల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

‘దుర్గం’లో దోపిడీ దొంగల బీభత్సం

Mar 13 2025 11:53 AM | Updated on Mar 13 2025 11:50 AM

కళ్యాణదుర్గం: పట్టణంలో మంగళవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. కత్తులు చేత పట్టుకుని హల్‌చల్‌ చేశారు. ఏకంగా రెండిళ్లలో చోరీలకు పాల్పడి, మరో ఇంట్లోకి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.... కళ్యాణదుర్గంలోని పార్వతీ నగర్‌లో నివాసముంటున్న దీప, అనిల్‌ దంపతులు మంగళవారం రాత్రి ఇంటికి తాళం వేసి పైకెళ్లి నిద్రించారు. విషయాన్ని గుర్తించిన దుండగులు లోపలకు చొరబడి బీరువాను ధ్వంసం చేసి, నాలుగు తులాల బంగారు నగలు, రూ.1.60 లక్షల నగదు అపహరించారు. అనంతరం పక్కనే ఉన్న శిల్ప ఇంట్లో చొరబడి బ్రాస్‌లైట్‌ను అపహరించారు. ముదిగల్లు బైపాస్‌ వద్ద శ్రీకాంత్‌కు చెందిన నాలుగు గొర్రెలను ఎత్తుకెళ్లారు.

ముసుగులు ధరించి... కత్తులు చేతపట్టి

పార్వతీనగర్‌ శివారు ప్రాంతంలోని అక్కమాంబ కొండ సమీపంలో నివాసముంటున్న మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు బాబు ఇంటి వద్ద మంగళవారం అర్థరాత్రి 2.10 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, కత్తులతో హల్‌చల్‌ చేశారు.ఒకరు ప్రహరీ దూకి లోపలికి చొరబడే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కుక్కలు మొరగడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీకెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి.

పరిశీలించిన డీఎస్పీ రవిబాబు

వరుస దోపిడీల సమాచారం అందుకున్న డీఎస్పీ రవిబాబు, అర్బన్‌ సీఐ యువరాజు, సిబ్బంది బుధవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీంను రంగంలో దింపి నిందితుల ఆధారాలు సేకరించారు. కాగా, దుండగులు కత్తులు పట్టుకుని సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వచ్చిన వారు దొంగలా లేక పార్థీ గ్యాంగ్‌ ముఠా సభ్యులనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమయ్యాయి.

రెండిళ్లలో వరుస చోరీలు

ముదిగల్లు బైపాస్‌లో నాలుగు గొర్రెల అపహరణ

అర్ధరాత్రి కత్తులతో దుండగుల హల్‌చల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement