హోరాహోరీగా ఇరుసు ఎత్తు పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా ఇరుసు ఎత్తు పోటీలు

Mar 11 2025 12:29 AM | Updated on Mar 11 2025 12:25 AM

పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికిలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి గ్రామీణ యువకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పోటీ పడ్డారు. గుంతకల్లు మండలం తిమ్మాపురం వీరేష్‌ ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, ద్వితీయ స్థానంలో పామిడి మండలం వంకరాజుకాలువకు చెందిన నరేష్‌, తృతీయ స్థానంలో నాగలాపురం గ్రామానికి చెందిన నరేంద్ర నిలిచారు. విజేతలను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు.

సమస్యలపై సత్వరమే

స్పందించాలి : ఎస్పీ

అనంతపురం: పిటీషనర్ల సమస్యలపై సత్వరమే స్పందించాలని సిబ్బందిని ఎస్పీ పి. జగదీష్‌ ఆదేశించారు. పోలీస్‌కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 61 వినతులు అందాయి. వినతులను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే పిటీషన్లను నిర్ణీత గడువు లోపు చట్ట పరిధిలో విచారించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ డీవీ రమణ మూర్తి, మహిళా పీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

సీనియారిటీ జాబితా లోపభూయిష్టం : వైఎస్సార్‌టీఏ

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో అనేక లోపాలున్నాయని వెఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్‌ కుమార్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణప్ప, రాష్ట్ర కార్యదర్శి ఏ. గోపాల్‌, రవీంద్రారెడ్డి గోవిందరెడి, రామకృష్ణ, కృష్ణా నాయక్‌, సిద్ధ ప్రసాద్‌, వెంకటరెడ్డి సోమవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా తయారీలో భాగంగా వివిధ సబ్జెక్టుల్లో ప్రమోషన్‌ పొందిన తేదీలను జాయినింగ్‌ తేదీలుగా నమోదు చేశారని, మరికొందరు మరుసటి రోజు జాయినింగ్‌ డేట్‌గా నమోదు చేయడంతో జాబితా మొత్తం తప్పుల తడకగా మారిందన్నారు. అంతర్‌ రాష్ట్ర బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయుల సీనియారిటీని కాకుండా వారు కేడర్‌లో చేరిన తేదీని సీనియారిటీ జాబితాలో చూపించారన్నారు. ఫలితంగా జూనియర్లయినా వారు జాబితాలో మాత్రం సీనియర్లుగా కనిపిస్తున్నారన్నారు. అలాగే ఒక మేనేజ్‌మెంట్‌ నుంచి మరొక మేనేజ్‌మెంట్‌కు మారిన వారిని క్షుణ్ణంగా పరిశీలించి జాబితా సరి చేయాలని కోరారు.

హోరాహోరీగా  ఇరుసు ఎత్తు పోటీలు 1
1/1

హోరాహోరీగా ఇరుసు ఎత్తు పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement