అనంతపురం: సమాజంలో మహిళల పాత్ర కీలకమని ఎస్పీ పి. జగదీష్ అన్నారు. పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ మహిళలు అభివృద్ధి సాధించారన్నారు. ఏ పోటీ పరీక్షల్లోనైనా మహిళల ప్రతిభ చాటుతున్నారు. పోలీసు శాఖలో మహిళా సిబ్బంది పాత్ర ప్రశంసనీయమన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ హెల్ప్ డెస్క్ నిర్వహిస్తున్నామన్నారు. మహిళా సాధికారిత వారోత్సవాల్లో నిర్వహించిన జరిపిన వ్యాసరచన, పెయింటింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినులకు ఎస్పీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అంతకు ముందు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి అర్‌అండ్‌బీ అతిథి గృహం, అంబ్కేర్ కూడలి, వై.జంక్షన్‌ల మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది. అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, అనంతపురం మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఎస్. మహబూబ్‌బాషా, అనంతపురం అర్భన్ డీఎస్పీ వి. శ్రీనివాసరావు, ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల నియామకం
అనంతపురం కార్పొరేషన్: క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా వైఎస్సార్‌సీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో కొన్ని నియామకాలు చేపట్టింది. ఇందులో భాగంగా మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పేరం స్వర్ణలత, అధికార ప్రతినిధిగా ఆర్.కృష్ణవేణి, రాష్ట్ర కార్యదర్శులుగా భూమిరెడ్డి జాహ్నవి, బోయ సుశీలమ్మ, కేఎల్ దేవి, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాటిల్ రామకృష్ణారెడ్డి, కార్యదర్శిగా నూకల పట్టాభి రామసుబ్బయ్య గుప్తా, రాష్ట్ర ఇంటిలెక్చువల్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా బాణ రాఘవేంద్ర, అధికార ప్రతినిధిగా డాక్టర్ పి.శంకరయ్య, కార్యదర్శిగా కట్టుబడి తానీష నియమితులయ్యారు.
సమాజంలో మహిళల పాత్ర కీలకం