అట్రాసిటీ చట్టం పటిష్టంగా అమలవ్వాలి | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ చట్టం పటిష్టంగా అమలవ్వాలి

Mar 8 2025 2:06 AM | Updated on Mar 8 2025 2:04 AM

అధికారులకు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశం

అనంతపురం అర్బన్‌: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి నిజమైన బాధితులకు న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సంబంధిత ఆదేశించారు. ‘పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం’ అంశంపై జిల్లా స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎస్పీ పి.జగదీష్‌తో కలసి కలెక్టర్‌ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు పరిహారం అందించాలని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం నుంచి రూ.58 లక్షలు నిధులు వచ్చాయన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో భూములకు సంబంధించి వివరాల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి, ఆయా వర్గాల వారికి మంజూరైన యూనిట్లు గ్రౌండింగ్‌ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించి కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జోక్యం చేసు కుని బాధితులకు సరైన సలహాలు, సూచనలు అందించాలని కమిటీ సభ్యులు బీసీఆర్‌ దాస్‌, నెరమెట్ల యల్లన్న, సాకే చిరంజీవి, ఇమామ్‌వలి, రామన్న కోరా రు. సమావేశంలో డీఆర్‌ఓ ఎ.మలోల, ఆర్‌డీఓలు కేశవనాయుడు, వసతంతబాబు, శ్రీనివాస్‌, సాంఘీక సంక్షేమశాఖ జేడీ రాధిక, గిరిజన సంక్షేమాధికారి రామాంజినేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధిలో యువత కీలకం

దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌ వద్ద ‘వికసిత్‌ భారత్‌ యువ పార్లమెంట్‌ 2025’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యక్రమంలో రాఘవేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రిన్సిపాల్‌ పద్మనాభరెడ్డి, అకాడమిక్‌ డైరెక్టర్‌ ఉమామహేశ్వరరావు, జేన్‌టీయూఏ ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌ శారద, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ నాగశుభ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన ప్రోగ్రామ్‌ ఇన్‌చార్జ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పది రోజుల్లో చార్జిషీట్‌ వేయాలి

ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించిన కేసులపై పది రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. 2024 సాధారణ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింస, నమోదైన కేసులపై జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఎస్పీ పి.జగదీష్‌తో కలసి ఆయన సమీక్షించారు. తాడిపత్రిలో 7 కేసులు నమోదు కాగా ఐదు కేసుల్లో చార్జిషీట్‌ దాఖలైందని, ఒకటి తప్పుడు కేసుగా నిర్ధారణ అయిందని తెలిపారు. మరో కేసు ఇన్వెస్టిగేషన్‌లో ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌ పోర్టల్‌ ఓపెన్‌ అయిన నేపథ్యంలో చార్జిషీట్‌ దాఖలులో పోలీసు యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని ఆర్డీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎ.మలోల, ఆర్‌డీఓ కేశవనాయుడు, కో–ఆర్డినేషన్‌ విభాగం సూపరింటెండెంట్‌ యుగేశ్వరిదేవి, డీసీఆర్‌బీ హరినాథ్‌, తాడిపత్రి టౌన్‌ సీఐ సాయిప్రసాద్‌, తహసీల్దారు రజాక్‌వలి, ఎన్నికల డీటీ కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement