
అర్జీలను పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమి
బొమ్మనహాళ్: వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించే అర్జీలపై నిర్లక్ష్యం వీడి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ గౌతమి అధికారులను ఆదేశించారు. బొమ్మనహాళ్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ‘జగనన్నకు చెబుదాం’ మండల స్ధాయి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా స్ధాయి అధికారులందరూ పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై 70 అర్జీలు అందాయి. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గడువులోపు అర్జీలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో కళ్యాణుదుర్గం ఆర్డీఓ రాణీ సుస్మిత, పీఆర్ ఎస్‌ఈ భాగ్యరాజ్, డీఎస్‌ఓ శోభారాణి, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నాగరాజ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి, హార్టికల్చర్ డీడీ రఘునాథ్‌రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ ఫిరోజ్‌ఖాన్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ రసూల్, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్, డీఈఓ నాగరాజు, ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రూప్లానాయక్, ఎల్‌డీఎం సత్యరాజ్, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి మహమ్మద్ రఫీ, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ షకీలాబేగం, ఇతర మండలస్ధాయి అధికారులు పాల్గొన్నారు.
● అంతకుముందు నేమకల్లు ఆంజనేయస్వామిని కలెక్టర్ గౌతమి దర్శించుకున్నారు. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం ఫలికారు. ప్రత్యేక పూజలు చేసి కలెక్టర్‌కు తీర్థప్రసాదాలు, స్వామి చిత్రపటం అందజేశారు.
● హరేసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని జిందాల్ సా ఫ్యాక్టరీని కలెక్టర్ గౌతమి పరిశీలించారు. జిందాల్ సా ఫ్యాక్టరీలోని పవర్ ప్లాంట్, బ్లాస్ట్ పర్మస్, డిటీ ప్లాంట్, తదితర విభాగాలను పరిశీలించి పనితీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.