●మహాత్ముని స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

●మహాత్ముని స్ఫూర్తి

Oct 2 2023 2:06 AM | Updated on Oct 2 2023 2:06 AM

గాంధీజీ వేషధారణలో తిరుపతయ్య - Sakshi

గాంధీజీ వేషధారణలో తిరుపతయ్య

అనంతపురం కల్చరల్‌: మహాత్ముడి వేషధారణలో కనిపిస్తున్న ఈయన పేరు తిరుపతయ్య. పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా అయినా బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగ అవకాశం దక్కడంతో 1987లో అనంత జిల్లాకు వచ్చి గార్లదిన్నెలో స్థిర నివాసమేర్పరుచుకున్నారు. ఆధునిక పోకడలు, యాంత్రిక జీవనంలో దేశభక్తులను నేటి తరం మరుస్తోందని గుర్తించిన ఆయన అంతరించి పోతున్న విలువలకు గాంధీజీ వేషధారణలో పునర్జీవం పోసే చర్యలు చేపట్టారు. 2021 నుంచి ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ గాంధీజీ వేషధారణలో ఆకట్టుకున్నారు. పాత తరం వారి ఆదర్శభావాలు నేటి తరానికి పరిచయం చేయకపోతే రానున్న కాలంలో మానవత్వం నశించి పోయే ప్రమాదముందని చెబుతుండే ఆయన.. గాంధీజీ వేషమే కాకుండా వాల్మీకి, అల్లూరి సీతారామరాజు వేషధారణలతోనూ కనిపిస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement